జీవిత భాగస్వామి కావాలంటూ త‌మిళ న‌టుడు ఆర్య‌ ప్రకటన.. ఆట‌ప‌ట్టిస్తున్న తార‌లు, నెటిజ‌న్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీవిత భాగస్వామి కావాలంటూ త‌మిళ న‌టుడు ఆర్య‌ ప్రకటన.. ఆట‌ప‌ట్టిస్తున్న తార‌లు, నెటిజ‌న్లు!

  • జీవిత భాగ‌స్వామి కావాలంటూ వీడియో పోస్ట్ చేసిన ఆర్య‌
  • న‌వ్వు పుట్టించే ఫొటోలతో కామెంట్లు చేస్తున్న నెటిజ‌న్లు
  • అమ్మాయిల నెంబ‌ర్లు త‌న‌కు పంపాల‌ని కోరిన అల్లు శిరీష్‌
త‌న‌కో జీవిత భాగ‌స్వామి కావాలంటూ త‌మిళ న‌టుడు ఆర్య సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 'మాపిళ్ళై ఆర్య‌' అనే రియాలిటీ షో కోసం ఆర్య ఇలా చేసిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ పోస్ట్ గురించి ఇత‌ర సినీ తార‌లు ఫ‌న్నీ కామెంట్లు చేస్తూ ఆర్య‌ను ఆట‌ప‌ట్టిస్తున్నారు.

ఆల్ ద బెస్ట్ అంటూ ద‌గ్గుబాటి రానా కామెంట్ చేయ‌గా, అమ్మాయిల నెంబ‌ర్లు త‌న‌కు పంపాల‌ని అల్లు శిరీష్ కామెంట్ చేశారు. ఇదేదో గిమ్మిక్కులాగ ఉందంటూ రాధిక కామెంట్ చేయ‌గా, ఇలాంటి ప‌ని నువ్వు మాత్రమే చేయ‌గ‌ల‌వంటూ ఖుష్బూ రాసింది. ఇంకా సిద్ధార్థ‌, శ్రియా రెడ్డి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్‌, న‌టి త్రిష‌, త‌మిళ న‌టులు ప్ర‌స‌న్న‌, జ‌యం ర‌విలు కూడా కామెంట్లు చేశారు.

ఇక ఇతర నెటిజ‌న్లైతే త‌మ‌కు తోచిన విధంగా ఫొటోలు త‌యారు చేసి కామెంట్ల‌లో పోస్ట్ చేశారు. కొంత‌మంది నెటిజ‌న్లు మాత్రం వీడియోలో ఆర్య చెప్పిన నెంబ‌ర్ గురించి, వెబ్‌సైట్ గురించి ప‌రిశోధ‌న చేసి, ఇది రియాలిటీ షో కోసం ఆర్య చేస్తున్న ప‌బ్లిసిటీ స్టంట్ అంటూ నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
arya
raja rani
mapillaiarya
reality show
video
twitter
comments
rana
allu sirish

More Telugu News