'ఓ పని చేయండి.. ఈ షరతుపై నా సినిమా పైరసీ కాపీ చూడండి!' అంటూ అభిమానికి నిర్మాత సలహా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఓ పని చేయండి.. ఈ షరతుపై నా సినిమా పైరసీ కాపీ చూడండి!' అంటూ అభిమానికి నిర్మాత సలహా!

  • సినిమా విడుదల కాలేదు ఎలా చూడాలి?
  • 25 రోజులు ఆగి అమెజాన్ ప్రైమ్ లో చూడు...లేదంటే క్వాలిటీ పైరసీ కాపీ చూడు.. కానీ 10 డాలర్లు దానం చెయ్
  • పైరసీని ప్రోత్సహించను..ప్రైమ్ లోనే చూస్తాను...దానం కూడా చేస్తాను
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏ చిత్రపరిశ్రమను చూసినా పైరసీపై పోరాడాలని నటులు, దర్శకులు, నిర్మాతలు అభిమానులకు పిలుపునిస్తుంటారు. అలాంటిది ఒక నిర్మాతే తన సినిమా పైరసీ కాపీ చూడాలని సంచలన సలహాను అభిమానికి ఇచ్చిన ఘటన కోలీవుడ్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... తాజాగా కార్తీ హీరోగా నటించిన ‘ఖాకీ’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని, తొలి మూడు రోజుల్లో పది కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఒక విదేశీ అభిమాని నిర్మాత ఎస్‌.ఆర్‌. ప్రభుకు ట్వీట్ చేస్తూ, తమ ప్రాంతంలో సినిమా విడుదల కాలేదు, ఎలా చూడాలని ప్రశ్నించారు.

 దానికి ఆయన సమాధానమిస్తూ ఒక 25 రోజులు ఎదురుచూసి, అమేజాన్‌ ప్రైమ్‌ లో చూడాలని సలహా ఇచ్చారు. 'అన్ని రోజులు ఎదురుచూడలేకపోతే ఒక్క షరతుతో ఆన్‌ లైన్లో క్వాలిటీ ఉన్న పైరసీ వెర్షన్‌ ను చూడండి. ఈ పైరసీ కాపీని చూసే ముందు 10 డాలర్లను ఎవరైనా అభాగ్యులకు దానం చేయండి. నేను సంతోషిస్తాను, మీరూ కూడా సంతోషంగా ఉంటారు' అంటూ సమాధానమిచ్చారు.

 ఆయన సమాధానానికి ముచ్చటపడిన ఆ వ్యక్తి ప్రతిస్పందిస్తూ, ‘25 రోజులు ఎదురుచూసి, అమేజాన్‌ ప్రైమ్‌ లోనే సినిమా చూస్తాను. పైరసీని నేను ప్రోత్సహించను. అయినా సరే 10 డాలర్లు అవసరం ఉన్న వారికి ‘ఖాకీ’ పేరుతో దానం చేస్తాను. సినిమా విజయం సాధించినందుకు ధన్యవాదాలు’ అంటూ సమాధానం చెప్పారు. వీరి ట్విట్టర్ సంభాషణ అందర్నీ ఆకట్టుకుంటోంది. 
khakee
movie
fan
producer
twitter

More Telugu News