పాత సంప్రదాయానికి హంగులు... ఇవాంకాకు కేసీఆర్ సర్ ప్రైజ్ బహుమతి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాత సంప్రదాయానికి హంగులు... ఇవాంకాకు కేసీఆర్ సర్ ప్రైజ్ బహుమతి!

  • ప్రత్యేక బహుమతితో ఇవాంకాను సర్ ప్రైజ్ చేయనున్న కేసీఆర్
  • గోల్కొండ కోటలో విందు సందర్భంగా గిఫ్ట్ బాక్స్ అందజేత
  • విదేశాల నుంచి వచ్చే అతిథులకు చార్మినార్ మెమొంటో అందజేసే సంప్రదాయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత సంప్రదాయానికి సరికొత్త హంగులు అద్దనున్నారు. గతంలో విదేశీ ప్రముఖులు హైదరాబాదుకు వచ్చినప్పుడు వారికి గత ముఖ్యమంత్రులు జ్ఞాపికగా చార్మినార్ ప్రతిమను అందజేసేవారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల హయాంలో బిల్ క్లింటన్, జార్జ్‌ బుష్ లు హైదరాబాదు పర్యటనకు రాగా, వారికి చార్మినార్ మెమొంటోను అందజేశారు. అలాగే ఇతర ప్రముఖులకు కూడా దానినే జ్ఞాపికగా ఇచ్చేవారు. ఇవాంకా విషయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే దానికి మరిన్ని బహుమతులు జోడించనున్నారు.

ఈ సందర్భంగా ఆమెకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ బాక్స్‌ ను అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో చార్మినార్‌ మెమొంటోతోపాటు, హైదరాబాద్ స్వర్ణకారులు ప్రత్యేకంగా రూపొందించిన బంగారు నగలు, గద్వాల, సిరిసిల్ల నేతన్నలు ప్రత్యేకంగా రూపొందించిన చేనేత చీరలను ఉంచనున్నారు. ఏఏ బహుమతులు గిఫ్ట్ బాక్స్‌ లో ఉంచాలన్నది కేసీఆర్ నిర్ణయిస్తారని అధికారులు చెబుతున్నారు. గోల్కొండ కోటలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందు సందర్భంగా ఇవాంకాకు కేసీఆర్ ఈ గిఫ్ట్ బాక్సును అందజేస్తారు.
ivanka trump
america
Hyderabad
KCR

More Telugu News