అవకాశాలు అడిగే అలవాటు లేదు .. అలా జరిగిన సందర్భాలూ వున్నాయి!: స్వాతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవకాశాలు అడిగే అలవాటు లేదు .. అలా జరిగిన సందర్భాలూ వున్నాయి!: స్వాతి

  • అవకాశాలు వెతుక్కుంటూ రావాలనుకోను
  • ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిస్తే వెళతాను
  • నా సినిమాలు వేరే హీరోయిన్స్ కి వెళ్లాయి  
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో స్వాతి మంచి మంచి సినిమాలు చేస్తోంది. అయితే ఆశించిన స్థాయిలో ఆమెకి అవకాశాలు లేవనే చెప్పాలి. ఆమె కంటే వెనుక వచ్చిన హీరోయిన్స్ ఎక్కువ సినిమాలు చేస్తూ వెళుతున్నారు. అడగనిదే అమ్మయినా పెట్టదు కదా .. అందువల్లనే అవకాశాలు తగ్గాయేమో అనే అభిప్రాయం ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో స్వాతికి ఎదురైంది. అందుకామె తనదైన శైలిలో స్పందించింది.

"అసలు ఎవరిని కలిసి ఏమి అడగాలో నాకు తెలియదు. ఒక సినిమా కాస్టింగ్ అవుతోంది .. ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిస్తే తప్పకుండా ఆడిషన్ కి వెళతాను. ఫలానా పాత్రకి .. ఫలానా ఏజ్ గ్రూప్ వారికి అంటూ ఆడిషన్స్ జరుగుతూ ఉంటే వెళ్లడానికి నేను ఎంతమాత్రం ఆలోచించను. అంతే తప్ప నాకు అవకాశాలు అడిగే అలవాటు లేదు. ఒక సినిమా ప్రారంభానికి ముందు నన్ను కన్ఫర్మ్ చేసుకుని తీరా ఆ తర్వాత అవి వేరే హీరోయిన్స్ కి వెళ్లిన సందర్భాలు వున్నాయి. ఆ తరువాత దర్శకుడో .. నిర్మాతనో నింపాదిగా ఫోన్ చేసి సారీ చెప్పేస్తుంటారు. కానీ ఆ సినిమాకి ముందు నుంచి నేను పనిచేశాను అని ఎవరికీ చెప్పుకోలేను కదా" అంటూ చెప్పుకొచ్చింది.    
swathi

More Telugu News