ఫస్ట్ వచ్చిన రూమర్ అదే .. ఆ తరువాత చాలా వచ్చాయి: స్వాతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫస్ట్ వచ్చిన రూమర్ అదే .. ఆ తరువాత చాలా వచ్చాయి: స్వాతి

  • సహజంగానే నాపై రూమర్స్ వచ్చాయి
  • 'డేంజర్' మూవీ టైమ్ లో ఫస్టు రూమర్ 
  • అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి  
"మీరు సినిమాల్లో చేసే హీరోలందరితో మీకు రిలేషన్ షిప్ అంటగట్టారు. ఒకసారి నాని.. ఒకసారి నిఖిల్ .. ఒకసారి జై పేర్లతో ముడిపెడుతూ వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా వినిపించింది .. లేకపోతే పాట ఎందుకు పాడిస్తాడు? అని చెప్పుకున్నారు. ఇలాంటి రూమర్స్ వినిపించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది"? అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో స్వాతికి ఎదురైంది.

 అప్పుడామె స్పందిస్తూ .. "మొదటి రూమర్ అల్లరి నరేశ్ తో ముడిపెడుతూ వచ్చింది .. 'డేంజర్' సినిమా చేసిన సమయంలో.. "ఇదేంటబ్బా .. " అనుకున్నాను. "నిప్పులేనిదే పొగ రాదంటారు .. కానీ ఈ రూమర్ నిప్పులేకుండానే వచ్చేసింది. సహజంగానే నేను నా కో ఆర్టిస్టులతో చనువుగా ఉంటుంటాను .. అందువలన అలాంటి రూమర్స్ వచ్చి ఉండొచ్చునేమో. రూమర్స్ అలవాటైన తరువాత పెద్దగా పట్టించుకోవడం మానేశాను గానీ, కొన్ని సందర్భాల్లో అవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి" అని చెప్పుకొచ్చారు.   
swathi

More Telugu News