పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టులో కేవీపీ పిటిషన్!
- నిర్మాణ వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశించాలి
- పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందు పర్చిన విధంగానే వ్యవహరించాలి-కేవీపీ
- పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం
- 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచన
పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ సర్కారు ఖర్చు చేసిన 3800 కోట్ల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించాల్సిందిగా కోర్టును కోరారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం పోలవరంపై తమ వైఖరి చెప్పాలని కేంద్ర సర్కారుకి ఆదేశాలు జారీచేసి, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.