అసలు అఖిల్ రెండో సినిమా నేను చేయాల్సిందే!: బండ్ల గణేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసలు అఖిల్ రెండో సినిమా నేను చేయాల్సిందే!: బండ్ల గణేశ్

  • అందరి హీరోలను అభిమానిస్తాం 
  • అఖిల్ రెండవ సినిమా చేయాలనుకున్నాను 
  • హైదరాబాద్ లో మంచి స్టూడియో కడతాను    
తాజాగా బండ్ల గణేశ్ .. ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. " మా ఇంట్లో అందరు హీరోలను అభిమానిస్తారు. నాకు పవన్ కల్యాణ్ అంటే ప్రాణం ..  మా నాన్నకి ఎన్టీఆర్ అంటే అభిమానం .. మా అబ్బాయికి అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఇట్లా అందరు హీరోలు మావాళ్లే .. అందరూ మా ఇంటికి వచ్చిన వాళ్లే" అన్నారు.

"ఎన్టీఆర్ ఫ్యామిలీతో .. చిరూ ఫ్యామిలీతో సినిమాలు చేశారు .. మరి అక్కినేని హీరోలతో సినిమాలు ఎందుకు చేయలేదు?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు గణేశ్ సమాధానమిస్తూ .. " అఖిల్ రెండవ సినిమా చేయడానికి ప్రయత్నించానుగానీ కుదరలేదు.. తప్పకుండా ఆయనతో ఒక సినిమా చేస్తాను. ఇంకా ఓ ఇరవై యేళ్ల పాటు నేను ఇక్కడ సినిమాలు చేస్తూనే వుంటాను. ఆ తరువాత మా అబ్బాయి కూడా సినిమాల నిర్మాణం చేస్తూనే వెళతాడు. చిన్న నిర్మాతలకి అందుబాటులో ఉండేలా హైదరాబాద్ లో ఓ మంచి స్టూడియో కడతాను" అంటూ చెప్పుకొచ్చారు.   
Bangladesh
tnr

More Telugu News