చెప్పినట్టుగానే 'సింహా'లా వచ్చారు.. హ్యాట్సాఫ్ టు బాలయ్య!: యాంకర్ ఉదయభాను
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెప్పినట్టుగానే 'సింహా'లా వచ్చారు.. హ్యాట్సాఫ్ టు బాలయ్య!: యాంకర్ ఉదయభాను

  • బాలయ్యలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు
  • పిల్లలను ఆశీర్వదించి, సరదాగా గడిపారు
  • 45 నిమిషాలు మాతోనే ఉన్నారు
ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణపై యాంకర్ ఉదయభాను ప్రశంసలు కురిపించింది. బాలయ్య చాలా గొప్ప వ్యక్తి అని కితాబిచ్చింది. తన కవల పిల్లల పుట్టిన రోజుకు ఆయన వచ్చి, పెద్ద మనసుతో ఆశీర్వదించడం మరిచిపోలేని అనుభూతి అని తెలిపింది. చిన్న వయసులోనే కుటుంబం కోసం సినిమాల్లోకి వచ్చానని చెప్పిన భాను... తన జీవితంలో వేడుకలు అనేవే లేవని చెప్పింది.

తన జీవితంలో మొట్టమొదటి పండుగ తన పిల్లల తొలి పుట్టిన రోజే అని భాను తెలిపింది. సినీ పరిశ్రమకు చెందినవారి సమక్షంలో వేడుకలు జరుపుకోవాలని అనుకున్నామని... చాలా మందికి ఫోన్ చేసినప్పటికీ ఎవరూ లిఫ్ట్ చేయలేదని చెప్పింది. చివరకు బాలయ్యకు ఓ మెసేజ్ పెట్టగా, రావడానికి ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారని తెలిపారు. తర్వాతి రోజు మీటింగ్ ఉందని... అయినా వచ్చి వెళతానని చెప్పారని... చెప్పినట్టుగానే సింహాలాగా వచ్చారని ఎంతో సంతోషంగా తెలిపింది. ఆ సమయంలో ఆయన నాకు ఒక దేవుడిగా కనిపించారని చెప్పింది. అందరు సెలబ్రిటీల్లా ఐదు నిమిషాలు ఉండి వెళ్లిపోకుండా... 45 నిమిషాల పాటు సరదాగా గడిపి, అందరితో ఫొటోలు దిగి వెళ్లారని తెలిపింది. బాలయ్యలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారని... హ్యాట్సాఫ్ బాలయ్య అంటూ పొగడ్తలు కురిపించింది.

Balakrishna
udayabhanu
tollywood

More Telugu News