అయ్యప్ప జోలపాట 'హరివరాసనం'లో మార్పు చేయనున్న ట్రావెన్ కోర్ దేవస్థానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అయ్యప్ప జోలపాట 'హరివరాసనం'లో మార్పు చేయనున్న ట్రావెన్ కోర్ దేవస్థానం

  • శబరిగిరుల్లో వెలసిన అయ్యప్ప స్వామి
  • అష్టకంలోని సంస్కృత పదాల రూపాంతరం
  • 'అరివిమర్దనం' ను విడివిడిగా పలకాలి
  • త్వరలోనే కొత్త శ్లోకాల రికార్డు: టీబీడీ
పంబానది తీరాన, శబరిగిరుల్లో వెలసి కోట్లాది మంది కొంగుబంగారమైన అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చుతూ పాడే జోలపాట 'హరివరాసనం నిత్యమోహనం' అష్టకంలో ఉన్న చిన్న చిన్న తప్పులను సరిదిద్దినట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) నిర్ణయించింది. ఈ శ్లోకాల్లోని కొన్ని సంస్కృత పదాలు రూపాంతరం చెందాయని, మరికొన్ని అసలుకే లేవని పేర్కొన్న టీబీడీ, ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేజే ఏసుదాస్ రాగానే, సరిదిద్దిన 'హరివరాసనం' రికార్డు చేస్తామని అన్నారు.

ఈ అష్టకంలోని 'అరివిమర్దనం... నిత్యనర్తనం' అన్న వాక్యంలో 'అరి' అంటే శత్రువని, 'మర్దనం' అంటే నాశనం చేయడమన్న అర్థం వస్తుందని, ప్రస్తుతం ఈ రెండు పదాలనూ కలిపి పలుకుతుండగా, మారిన శ్లోకంలో రెండు విడివిడి పదాలుగా ఉంటాయని పేర్కొంది. కాగా, 'హరివరాసనం' శ్లోకాలను ఎందరో గాయకులు ఆలపించినప్పటికీ, ఏసుదాస్ గానం చేసిన శ్లోకాలే, అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్న సంగతి తెలిసిందే.
sabarimala
ayyappa
harivarasanam
jesudas

More Telugu News