శ్రీలంక టపటపా... గంట వ్యవధిలో 3 వికెట్లు ఫట్!
- ఈ ఉదయం డిక్ వెలా, చండీమల్ అవుట్
- డక్కౌట్ అయిన షనాక
- లంక స్కోరు 58 ఓవర్లలో 209/7
53వ ఓవర్ లో డిక్ వెలా (35), 54వ ఓవర్ లో షనాక (0), 55వ ఓవర్ లో చండీమల్ (28) పరుగులు చేసి అవుట్ అయ్యారు. షనాక వికెట్ ను భువనేశ్వర్ కుమార్ తీసుకోగా, మిగతా రెండూ మహమ్మద్ షమీ ఖాతాలో చేరాయి. ప్రస్తుతం పెరీరా, హెరాత్ లు ఆడుతుండగా, లంక స్కోరు 58 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు.