నా మాటలన్నీ ఓన్... వెనుక ఏ శక్తీ లేదు: దర్శకుడు గుణశేఖర్
- నంది అవార్డుల విషయంలో కొనసాగుతున్న దుమారం
- గుణశేఖర్ అసహనం వెనుక ఎవరో ఉన్నారని ఆరోపణలు
- బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్
తన వెనుక ఎలాంటి శక్తీ లేదని, తన మాటలన్నీ హృదయం నుంచి వచ్చినవేనని, 'రుద్రమదేవి'కి అవార్డులు రాలేదన్న బాధ తనకుందని చెప్పుకొచ్చాడు. రాంగోపాల్ వర్మ వంటి దర్శకుడి కామెంట్లను కూడా ప్రతికూలంగా తీసుకుని ఆయనపై విరుచుకుపడటం సరికాదని అభిప్రాయపడ్డాడు. 'రుద్రమదేవి'లో సందేశం లేదని జ్యూరీ కమిటీ సభ్యులు చేసిన వ్యాఖ్యనూ గుణశేఖర్ ఖండించాడు.