మాజీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దురాగతాలు... 50 మంది మహిళలపై అత్యాచారం!

  • ‘దండుపాళ్యం’ సినిమా ప్రేరణతో మహిళలపై అత్యాచారాలు 
  • బైక్ పై తిరుగుతూ ఒంటరి మహిళల ఇళ్ల గుర్తింపు 
  • మంచినీళ్లు కావాలంటూ ఇంట్లో చొరబడి దోపిడీ, అత్యాచారాలు
  • సెల్ ఫోన్ నిండా నగ్నదృశ్యాలు చూసిన పోలీసులు షాక్
గణితంలో పట్టభద్రుడై, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పని చేసిన యువకుడు ‘దండుపాళ్యం’ సినిమా నుంచి ప్రేరణ పొంది సుమారు 50 మంది మహిళలపై అత్యాచారం చేసిన ఘటన చెన్నైలో వెలుగు చూసింది. ఈ దారుణం  వివరాల్లోకి వెళ్తే... ఒక కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు మదన్‌ అరివళగన్‌ (28) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకుని షాక్ తిన్నారు. ఆ సెల్ ఫోన్ నిండా నగ్నంగా ఉన్న మహిళల దృశ్యాలు ఉండడంతో వాటిని పరిశీలించారు. అనంతరం అతనిని మరింత లోతుగా విచారించారు.

దీంతో అడయార్ పరిసర ప్రాంతాల్లో పగటిపూట బైక్ పై తిరుగుతూ మహిళలు ఒంటరిగా ఉన్న ఇళ్లను పరిశీలించి, ఎంచుకునేవాడు. ఆ తరువాత వారి దగ్గరకు వెళ్లి దాహమేస్తోందంటూ మంచినీళ్లు అడిగేవాడు. మహిళలు నీరు తెచ్చేందుకు లోపలికి వెళ్లగానే వారితోపాటు లోపలకి చొరబడి కత్తి చూపించి నగలు దోచుకునేవాడు. అనంతరం వారిపై అత్యాచారానికి తెగబడేవాడు.

 ఆ తరువాత సెల్ ఫోన్ లో వారిని నగ్నంగా చిత్రీకరించి, తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ నగ్నచిత్రాలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించేవాడు. దీంతో అత్యాచారం జరిగి కుంగిపోయిన మహిళలు, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయేవారు. ఆ విధంగా అతను 50 మంది మహిళలపై అత్యాచారాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
Go Back to Shorts
rapist
chennai
Rape of 50 women

More Telugu News