Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ వార్త‌ల్లో నిజం లేదు.. నాకేం కాలేదు: అమితాబ్ బ‌చ్చ‌న్

  • కోల్‌కతాలో బిగ్ బీ ప్ర‌యాణిస్తోన్న కారు ప్ర‌మాదానికి గురైంద‌ని వార్త‌లు
  • మ‌రో కారులో అమితాబ్‌ ఎయిర్‌పోర్టుకి వెళ్లార‌ని చెప్పిన పోలీసులు
  • కారు ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని చెప్పిన అమితాబ్‌
  • ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని స్ప‌ష్టం
కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని తిరిగి వెళుతోన్న బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ కారు వీల్ ఊడిపోయింద‌ని వార్తలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ఆయ‌న‌ మ‌రో కారులో ఎయిర్‌పోర్టుకి వెళ్లార‌ని కోల్‌క‌తా పోలీసులు కూడా చెప్పారు. అస‌లు ఏం జ‌రిగింద‌ని అమితాబ్ అభిమానులు ఆరా తీస్తుండ‌డంతో దీనిపై బిగ్ బీ స్పందించారు. తాను కారు ప్రమాదం నుంచి బయటపడినట్లు వార్తలు వ‌స్తున్నాయని, అందులో ఏమాత్రం వాస్తవం లేద‌ని అన్నారు. ఎటువంటి రోడ్డు ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని, తాను బాగానే ఉన్నాన‌ని అమితాబ్ చెప్పారు. ప్రస్తుతం అమితాబ్ ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీబిజీగా ఉన్నారు.    
Amitabh Bachchan
car
accident
kolkata

More Telugu News