నా భార్యకు ఓటు వేయండి.. లేకపోతే కష్టాల పాలవుతారు... ముస్లింలను బెదిరించిన బీజేపీ నాయకుడు
- స్థానిక ఎన్నికల్లో భార్య తరఫున ప్రచారం చేసిన యూపీ బీజేపీ కౌన్సిలర్
- సభలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు
- వారి సమక్షంలోనే హెచ్చరికలు చేసిన రంజిత్ కుమార్ శ్రీవాత్సవ
'ఇది సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం కాదు. మీ నాయకులెవరూ మీకు సహాయం చేయలేరు. రోడ్లు, నాలాల మరమ్మత్తుతో పాటు ఇంకా చాలా పనులు స్థానిక సంస్థల చేతిలోనే ఉంటాయి. ఇక్కడ బీజేపీకి ఎదురేలేదు. అందుకే వారి విజయంలో మరింత సహాయం చేయండి. మీరు రంజిత్ కుమార్ భార్యకు ఓటు వేయకపోతే, ఎదుర్కోబోయే కష్టాల నుంచి సమాజ్వాదీ పార్టీ కూడా మిమ్మల్ని కాపాడలేదు. అందుకే ముస్లింలు అందరికీ ఇదే నేను చెబుతున్నా... మాకు ఓటు వేయండి. నేను ఓట్లు అడగడం లేదు..ఒకవేళ ఓటు వేస్తే ప్రశాంతంగా ఉంటారు, లేదంటే కష్టాల పాలవుతారు' అని రంజిత్ కుమార్ అన్నాడు.