పుజారా ఒక్కడూ 47... మిగిలిన వారంతా కలిసి 27 పరుగులు!
- టెస్టు క్రికెట్ కు మరోసారి వరుణుడి అడ్డు
- లంచ్ విరామానికి ముందు ఆగిన ఆట
- కాస్తంత నిలదొక్కుకున్న పుజారా
- ప్రస్తుతం స్కోరు 75/5
ఒక్క పుజారా మాత్రమే క్రీజులో నిలదొక్కుకుని 102 బంతులను ఆడి 47 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి దగ్గరయ్యాడు. మొత్తం 75 పరుగుల్లో పుజారా ఒక్కడు చేసినవి 47 పరుగులు కాగా, కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రహానే, అశ్విన్, సాహాలు కలసి చేసింది 27 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. సాహా ప్రస్తుతం 6 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ప్రస్తుతం మైదానాన్నంతా కవర్లతో కప్పిన స్టేడియం సిబ్బంది వర్షం తెరిపిస్తుందని వేచి చూస్తున్నారు.