50 పరుగులకు 5 వికెట్లు... అత్యంత చెత్తగా సాగుతున్న భారత బ్యాటింగ్!
- పేలవంగా సాగుతున్న భారత్ ఆట
- షనాకా బాల్స్ కు దొరికిపోయిన అశ్విన్, రహానే
- ప్రస్తుతం స్కోరు 29 ఓవర్లలో 55/5
దీంతో భారత జట్టు 50 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లను కోల్పోయింది. ఈడెన్ పిచ్ పై బంతి అనూహ్యంగా స్వింగ్ అవుతూ భారత బ్యాట్స్ మన్లను ఇబ్బందులు పెడుతుండగా, లంక బౌలర్లు విజృంభిస్తున్నారు. ప్రస్తుతం పుజారా 91 బంతుల్లో 33 పరుగులతో ఆడుతుండగా, మరో ఎండ్ లో సాహా పరుగులేమీ చేయకుండా క్రీజులో నిలదొక్కుకునేందుకు తంటాలు పడుతున్నాడు. భారత స్కోరు 29 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు.