తాజా సినిమా టీజర్.. జ్యోతిక నోటి వెంట అసభ్యపు మాటలు... నువ్విలా ఏంటని మండిపడుతున్న నెటిజన్లు!

నటుడు సూర్యను పెళ్లి చేసుకున్న అనంతరం కొంతకాలం చిత్ర పరిశ్రమకు దూరమైన జ్యోతిక, '36 వయనిదిలే'తో రీఎంట్రీ అయి, ప్రస్తుతం 'నాచియార్' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఆమె పోలీస్ అధికారిగా, హీరోగా జీవీ ప్రకాశ్ కుమార్ నటిస్తుండగా, బుధవారం విడుదలైన చిత్రం టీజర్ కు నెటిజన్ల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది.

ఓ పోలీస్ స్టేషన్ లో జ్యోతిక రాయలేని విధంగా బూతులు తిడుతున్నట్టు టీజర్ లో ఉండటమే ఇందుకు కారణం. ఈ సినిమాకు దర్శకుడు బాలా కాగా, ఆయన చిత్రాల్లో ఇటువంటి సంభాషణలు సాధారణమే అయినా, సీనియర్ నటి అయిన జ్యోతిక ఇటువంటి మాటలు చెప్పేందుకు ఎలా అంగీకరించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రచారం కోసం ఇలాంటి చౌకబారు ఎత్తులు అవసరమా? అని కొందరు అంటుంటే, సెన్సార్ ఏం చేస్తోందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ సంభాషణలు తొలగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇక ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి!
Go Back to Shorts
jyothika
nachiyaar
tamil movie

More Telugu News