2 లక్షలు తీసుకుని ఉద్యోగం చూపని గల్ఫ్ ఏజెంట్ పై కత్తితో బాధితుడి దాడి!
- 2 లక్షల రూపాయలు తీసుకుని గల్ఫ్ కు పంపిన ఏజెంట్
- అప్పు చేసి తిరిగి భారత్ చేరి, ఫరూఖ్ ను నిలదీసిన విశ్వ
- పోలీసులతో కొట్టిస్తానని హెచ్చరించడంతో ఫరూఖ్ పై దాడి చేసిన బాధితుడు
దీంతో విశ్వ అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. ఆశలు అడియాసలు కావడంతో అక్కడ తెలిసిన వారి నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేశాడు. అనంతరం ఫరూఖ్ ను ప్రశ్నించాడు. తన డబ్బులు తనకు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే మరోసారి డబ్బులు అడగడానికి వస్తే పోలీసులతో కొట్టిస్తానని ఫరూఖ్ సమాధానం చెప్పడంతో విశ్వ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఫరూఖ్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన గాయపడ్డాడు.