అలాంటి సినిమాలు చేస్తే చెప్పుతో కొట్టండి: హీరో సిద్ధార్థ్
- మంచి సినిమాలే చేస్తా
- తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు
- రేపు విడుదల కానున్న సిద్ధార్థ్ సినిమా 'గృహం'
ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ, కెరీర్ పరంగా తానెప్పుడూ కిందకు పడిపోలేదని, కేవలం బ్రేక్ మాత్రమే తీసుకున్నానని చెప్పాడు. తానెప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటానని తెలిపాడు. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని... వారి అభిరుచులకు అనుగుణంగానే తన సినిమాలు ఉంటాయని చెప్పాడు. మంచి సినిమాలను తీస్తేనే, ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపాడు. పదేళ్ల క్రితం ఒకటి, ఐదేళ్ల క్రితం ఒక ఘటన తన జీవితంలో జరిగాయని... అవి జరగకపోయుంటే ఏది తప్పో, ఏది ఒప్పో ఇప్పటికీ తనకు తెలిసుండేది కాదని అన్నాడు.