గతంలో పనిమనిషితో నటి భువనేశ్వరి కొడుకు పెళ్లి... ఇప్పుడు మరో అమ్మాయి వెంటపడి అరెస్ట్!
- ఇంట్లో పనిమనిషిగా లంక అమ్మాయిని తెచ్చుకున్న భువనేశ్వరి
- ఆ అమ్మాయితోనే కుమారుడి వివాహం
- అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినందుకు పోలీసు కేసు
- ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో విచారణ దశలో ఉన్న కేసు
తమ ఇంట్లో పని చేసేందుకు శ్రీలంక నుంచి ఓ యువతిని పిలిపించుకున్న భువనేశ్వరి, ఆపై ఆమెతోనే తన కుమారుడి పెళ్లి చేసినట్టు తెలుస్తోంది. ఆపై కొడుకుతో కలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినట్టు పోలీసు కేసు కూడా ఆమెపై నమోదైంది. ఈ కేసు మద్రాసు హైకోర్టులో ప్రస్తుతం విచారణ దశలో ఉండటం గమనార్హం. ఇప్పుడు తాజాగా కుమారుడి నిర్వాకం భువనేశ్వరిని మరోసారి వార్తల్లో నిలిపింది.