కరిష్మా కపూర్ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రణ్ ధీర్ కపూర్!
Add ap7am to your home Screen

కరిష్మా కపూర్ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రణ్ ధీర్ కపూర్!

  • కరిష్మా రెండోవివాహం చేసుకుంటే మద్దతిస్తాను
  • సందీప్ తోష్నివాల్ తో కలిసి ఉన్న ఫోటోలను మీడియాలో చూశాను
  • సందీప్ ను ఆమె నిజంగా ప్రేమిస్తుందేమో
  • అయినా ఈ కాలంలో రెండో వివాహం సాధారణమే
విడాకులు తీసుకుని భర్తకు దూరంగా ఉంటున్న ప్రముఖ నటి కరిష్మా కపూర్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు బీ-టౌన్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ముంబైకి చెందిన వ్యాపారవేత్త సందీప్‌ తోష్నివాల్‌ తో కరిష్మా ప్రేమలో ఉందని, త్వరలో వీరు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వెలువడడం పట్ల అలనాటి స్టార్ హీరో, ఆమె తండ్రి రణ్ ధీర్ కపూర్ స్పందించారు.

 ఆమె రెండో వివాహం చేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. కరిష్మా ఇంకా చిన్నదేనన్న ఆయన, తన ఆశీస్సులు ఆమెకి ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. సందీప్ ను ఆమె నిజంగా ప్రేమిస్తుందేమోనని అన్నారు. పేపర్లలో వారి ఫోటోలు చూస్తుంటానని ఆయన చెప్పారు. సందీప్ ని వివాహం చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలనుకుంటే దానికి తాను మద్దతిస్తానని ఆయన చెప్పారు. అయినా ఈ కాలంలో రెండో వివాహం సర్వసాధారణం అని ఆయన చెప్పారు.

కాగా, 2003లో కరిష్మా కపూర్ చిన్ననాటి స్నేహితుడైన సంజయ్ కపూర్ ని వివాహం చేసుకున్నారు. వారికి సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. 13 ఏళ్ల కాపురంలో కలతలు రావడంతో 2016లో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి ఉంటోంది. అనంతరం సంజయ్ ఢిల్లీకి చెందిన మోడల్ ప్రియా సచ్ దేవ్ ను వివాహం చేసుకున్నాడు. 
Bollywood
karishma kapoor
ranadheer kapoor
sandeep toshnival

More Telugu News