టీవీ సీరియల్లో కనిపించనున్న రెజ్లర్ బబితా ఫొగట్!
- 'అండ్ టీవీ'లో ప్రసారమయ్యే 'బధో బహూ'లో కనిపించనున్న రెజ్లర్
- అక్క బాటలోనే నడుస్తున్న చెల్లెలు
- 'ఖత్రోంకా ఖిలాడీ'లో కనిపించిన గీతా ఫొగట్
ఈ విషయాన్ని సీరియల్ నిర్మాతలు స్పష్టం చేశారు. నిజానికి గీతా, బబితా ఇద్దరినీ సీరియల్లో నటింపజేయాలని అనుకున్నట్లు నిర్మాత దీప్తి కల్వాని తెలిపారు. కానీ గీతా ఫొగట్ వేరే పనుల్లో బిజీగా ఉండటంతో కుదరలేదని అన్నారు. లావుగా ఉండే ఓ యువతి.. కుటుంబంలోను, సమాజంలోను గుర్తింపుకోసం ప్రయత్నించే కథాంశంతో ఈ సీరియల్ నడుస్తోంది.