ప్రత్యేక డూడుల్‌తో 'హోల్ పంచ్'కి గుర్తింపునిచ్చిన గూగుల్!
- హోల్ పంచ్‌కి పేటెంట్ వచ్చి 131 ఏళ్లు
- 1886, నవంబర్ 14న పేటెంట్ తీసుకున్న ఫ్రెడ్రిక్
- ఆకట్టుకుంటున్న డూడుల్
జర్మన్‌కి చెందిన ఫ్రెడ్రిక్ సోయ్‌నెక్కన్ 1886, నవంబర్ 14న హోల్ పంచ్‌కి పేటెంట్ తీసుకున్నారు. హోల్ పంచ్‌తో పాటు కాపీ బైండర్ను, క్యాలీగ్రఫీ కోసం ఉపయోగించే ప్రత్యేక సిరాను కూడా సోయ్‌నెక్కన్ తయారుచేశారు. ప్రస్తుతం ఎక్కువగా సింగిల్ హోల్ పంచ్‌ను ఉపయోగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో పేపర్లకు రంధ్రాలు చేయడానికి భారీ హోల్ పంచ్‌లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.