'బాహుబలి' స్టంట్ చేయబోయి ఆసుపత్రి పాలైన యువకుడు.. వీడియో చూడండి!
- సినిమాలోని స్టంట్ ను రియల్ గా చేయాలని భావించిన యువకుడు
- ఏనుగుకి అరటిపండు తినిపించి, ముద్దుపెట్టి, దంతాలపై నుంచి తలపైకి ఎక్కే ప్రయత్నం
- తిక్కరేగి తొండంతో నేలకేసి కొట్టి గాయపరిచిన ఏనుగు
తరువాత దాని తలపై సుతారంగా ముద్దు పెట్టాడు. అప్పుడు కూడా మౌనంగా ఉంది. అంతటితో ఆగని ఆ యువకుడు మెల్లగా దాని దంతాలు పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీంతో తిక్కరేగిన ఏనుగు తొండంతో అతనిని నేలకేసి విసిరికొట్టింది. క్షణమాగితే తొక్కి పేగులు బయటకు తీసేదే.. అయితే వీడియో తీస్తున్న యువకుడు వేగంగా స్పందించి, అతనిని రక్షించి, గాయాలపాలైన అతనిని ఆసుపత్రిలో చేర్చాడు. దీంతో చావుతప్పి కన్నులొట్టబోయిందిరా బాబూ అనుకుంటూ వైద్యచికిత్స పొందుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిని మీరు కూడా చూడండి.