రాష్ట్రపతి కుమార్తె ఉద్యోగాన్ని ఢిల్లీకి మార్చిన ఎయిరిండియా!
- ప్రధాన కార్యాలయానికి ట్రాన్స్ ఫర్
- రాష్ట్రపతి కూతురుగా భారీ భద్రత ఉంటుంది
- విమానంలో సెక్యూరిటీకి చోటు కల్పించడం కష్టం
ఈ సందర్భంగా ఎయిరిండియాకు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ, ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం ఆమె పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రపతి కుమార్తె కావడంతో ఆమె చుట్టూ భద్రతా సిబ్బంది ఉంటారని... ఎయిర్ హోస్టెస్ గా ఆమె కొనసాగితే, విమానంలో ఆమె భద్రతా సిబ్బందికి కూడా సీట్లు కేటాయించాలని, ఇది సాధ్యం కాదని... అందుకే ఆమెను ప్రధాన కార్యాలయానికి మార్చామని చెప్పారు.