ఆసుపత్రికి వెళ్లి మరీ ప్రేయసిని పెళ్లాడిన ప్రియుడు!
- సౌదీ అరేబియాలో పని చేస్తున్న ప్రియుడు
- వీరి ప్రేమ వివాహానికి రెండు కుటుంబాల సభ్యుల అంగీకారం
- ముహూర్తం సమయంలో ఆసుపత్రి పాలైన ప్రియురాలు
- సౌదీ నుంచి వచ్చి ఆసుపత్రిలోనే పెళ్లాడిన ప్రియుడు
వివాహ సమయం దగ్గరపడుతున్న సమయంలో హేరాకి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలిసిన ఆలం సౌదీఅరేబియా నుంచి కోల్ కతా చేరి, కుటుంబ సభ్యులను ఒప్పించి ఆసుపత్రిలోనే వివాహమాడాడు. అనారోగ్యంతో బాధపడుతున్న హేరాను కుటుంబ సభ్యులు ఎర్రటి లెహంగాలో ముస్తాబు చేయగా సంప్రదాయ పద్ధతిలో ఆమెను ఆసుపత్రిలోనే ఆలం వివాహం చేసుకున్నాడు. దీనిపై హేరా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.