మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నిక: తన స్థానాన్ని కాపాడుకున్న కాంగ్రెస్
- ఉపఎన్నికలో గెలుపొందిన కాంగ్రెస్
- 14,133 ఓట్ల తేడాతో విజయం
- కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోవడంతో అనివార్యమైన ఉప ఎన్నిక
ఈ నెల 9వ తేదీన ఈ ఉప ఎన్నిక జరిగింది. 65 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానంలో తిరిగి కాంగ్రెస్ పార్టీనే గెలవడంతో పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.