జగన్ వల్ల వచ్చిన మచ్చను పోగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు: సోమిరెడ్డి
- జగన్ కారణంగా ఏపీని అవినీతి రాష్ట్రం అంటున్నారు
- బాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి
- జగన్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఆస్తులు మాత్రమే పెరుగుతాయి
కేవలం జగన్ కారణంగానే విదేశాల్లో ఏపీని అవినీతి రాష్ట్రమని అంటున్నారని మండిపడ్డారు. జగన్ వల్ల మన రాష్ట్రానికి వచ్చిన అవినీతి మచ్చను పోగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అయిపోయినట్టు జగన్ కలలు కంటున్నారని... ఆయనను ప్రజలు నమ్మడం లేదని అన్నారు.