చీరకట్టిన ఫాతిమా చిన్నది... సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు
Add ap7am to your home Screen

చీరకట్టిన ఫాతిమా చిన్నది... సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు

  • కమలహాసన్ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్
  • దంగల్ లో గీతా ఫోగాట్ గా మంచి పేరుప్రతిష్ఠలు 
  • చీరతో ఫోటోషూట్ ఫోటోలను ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసిన సుందరి 
‘దంగల్’ సినిమాలో గీతా ఫోగాట్ పాత్ర పోషించిన ఫాతిమా సనా షేక్ ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసిన ఫొటోలు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. కమల్ హాసన్ నటించి, దర్శకత్వం వహించిన 'చాచీ 420' సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్ మోడ్రన్ గా ఉంటుంది. గతంలో, బీచ్ లో బికినీతో దిగిన ఫోటోలను పోస్టు చేసి, అతివాదుల విమర్శలు ఎదుర్కొంది కూడా.

తాజాగా, మెరూన్ కలర్ చీర కట్టి ఫొటో షూట్ లో పాల్గొన్న ఈ 25 ఏళ్ల సుందరి వాటిని సెల్ఫీ శారీ పేరిట తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. ఇవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘నువ్వీ చీరలో మరింత గ్లామరస్ గా ఉన్నావంటూ’’ కొందరు నెటిజన్లు ప్రశంసించగా, 'షేమ్ లెస్ సెల్ఫీ' అని మరికొందరు నెటిజన్లు అభినందించారు. కాగా, సనా షేక్ ప్రస్తుతం అమీర్ ఖాన్ తో కలిసి ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాలో నటిస్తోంది. 
fatimasanashaikh
dangal
Bollywood
actress

More Telugu News