ఏపీ అసెంబ్లీ వద్ద భారీ భద్రత.. గన్ మెన్లు కూడా లోపలకు వెళ్లలేరు!
- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపు
- వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా అనుమతి లేదు
పోలీసు అధికారుల మెడలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. క్యూఆర్టీ బృందాలను రంగంలోకి దించారు. ప్రజాప్రతినిధుల డ్రైవర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అనుచరులను కూడా అసెంబ్లీలోకి అనుమతించడం లేదు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముందస్తు అనుమతులు పొందినవారిని మాత్రమే అసెంబ్లీ పరిసరాల్లోకి అనుమతిస్తున్నారు. 4వ నెంబర్ గేటు వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు.