Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ ఎక్కడ ముద్దులు పెడతారోనని జనం భయపడి పారిపోతున్నారు: మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు

  • అధికారం కోసమే జగన్ పాదయాత్ర
  • ఈ యాత్ర ముగిసేసరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయం
  • ప్యారడైజ్ పేపర్లలో తన పేరు లేదని జగన్ బుకాయింపు
  • పాత్రికేయులతో మాట్లాడిన జవహర్
 ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఎక్కడ ముద్దులు పెడతారోనని జనం భయపడి పారిపోతున్నారని సెటైర్ వేశారు. అధికారం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ యాత్ర ముగిసే సరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ప్యారడైజ్ పేపర్లలో తన పేరు లేదని జగన్ బుకాయిస్తున్నారని, తన అక్రమాస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎందుకు జప్తు చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్
మంత్రి జవహర్

More Telugu News