హైద‌రాబాద్ మెట్రో రైల్‌లో ప్ర‌యాణించిన న‌ర‌సింహ‌న్‌, కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైద‌రాబాద్ మెట్రో రైల్‌లో ప్ర‌యాణించిన న‌ర‌సింహ‌న్‌, కేటీఆర్

  • ఎస్సార్ న‌గ‌ర్ నుంచి మియాపూర్ వ‌ర‌కు ప్ర‌యాణం
  • ప్ర‌యాణికుల‌కు క‌ల్పించ‌నున్న‌ వ‌స‌తుల ప‌రిశీల‌న‌
  • ఈ నెల 28న మెట్రో రైల్ తొలిద‌శ‌ ప్రారంభం
హైద‌రాబాదీయుల క‌ల‌ల బండి మెట్రోరైల్‌ మ‌రి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మెట్రోరైల్‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి శేఖ‌ర్ ప్ర‌సాద్ సింగ్, ప‌లువురు అధికారులు మెట్రో రైలు ట్రైల్‌లో ప్ర‌యాణించారు. న‌గ‌రంలోని ఎస్సార్ న‌గ‌ర్ నుంచి మియాపూర్ వ‌ర‌కు వారు ప్ర‌యాణించి, అందులో ప్ర‌యాణికుల‌కు క‌ల్పించిన వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. ఈ నెల 28న మెట్రోరైల్ తొలిద‌శ‌ను ప్రారంభించాల‌ని తెలంగాణ స‌ర్కారు యోచిస్తోంది.  
           
narasimhan
KTR
metri rail

More Telugu News