అఖిల్ కి 'హలో' సక్సెస్ కీలకం .. అందుకే వర్మకి నాగ్ ఆ మాట చెప్పారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిల్ కి 'హలో' సక్సెస్ కీలకం .. అందుకే వర్మకి నాగ్ ఆ మాట చెప్పారట!

  • అఖిల్ రెండవ సినిమాగా రూపొందుతోన్న 'హలో'
  • దర్శకుడిగా విక్రమ్ కుమార్ 
  • ఈ ప్రాజెక్టు పైనే దృష్టి పెట్టిన నాగ్ 
  • అఖిల్ కి ఈ సినిమా సక్సెస్ కీలకం
అఖిల్ రెండవ సినిమా 'హలో'ను నాగార్జున తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రిస్మస్ కానుకగా, వచ్చేనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నాగార్జునతో సినిమా చేయడానికి రామ్ గోపాల్ వర్మ రంగాన్ని సిద్ధం చేశాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో చేయడానికి నాగార్జున అంగీకరించారు.

అయితే ప్రస్తుతం తాను ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ కోసం కేవలం 10 రోజులు మాత్రమే కేటాయించగలనని నాగ్ చెప్పారట. అఖిల్ కి 'హలో' సక్సెస్ చాలా ముఖ్యమనీ, అందువలన ఈ సినిమా విడుదల తరువాతనే మళ్లీ తాను షూటింగ్ కి హాజరవుతానని అన్నారని సమాచారం.

'హలో' సినిమా ఫైనల్ అవుట్ పుట్ విషయంలోను .. మార్కెటింగ్ విషయంలోను తాను పూర్తి దృష్టి పెట్టవలసి ఉంటుందని తేల్చి చెప్పారట. తన సినిమాలకి సంబంధించిన విషయాలు ఇప్పుడు తనకి టెన్షన్ గా అనిపించడం లేదనీ, తన పిల్లల సినిమాలపైనే పూర్తి దృష్టి పెడుతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగ్ చెప్పారు కూడా.   
Nagarjuna

More Telugu News