ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు బ్రహ్మాండమైన ఆఫర్!
- మిగిలిపోయిన డేటాను వచ్చే నెలలో వాడుకునే అవకాశం
- 1000 జీబీల వరకు క్యారీ చేసుకోవచ్చు
- పోస్టుపెయిడ్ మొబైల్ యూజర్లకు మాత్రం 200 జీబీకే పరిమితం
తాజా ఆఫర్‌తో వినియోగదారులు ప్రతీనెలా మిగిలిపోయే డేటాను మొత్తంగా 1000 జీబీల వరకు పోగుచేసుకోవచ్చు. పోస్ట్ పెయిడ్ మొబైల్ వినియోగదారులకైతే ఇది 200 జీబీకే పరిమితం. అయితే ఈ అవకాశం అన్ని ప్లాన్లకు అందుబాటులో లేదు. ఎంపిక చేసిన కొన్ని ప్లాన్లకే ఈ రోల్ఓవర్ అవకాశం ఉంది. ఈ విషయంలో సర్కిల్‌కు, సర్కిల్ కు మధ్య కొంత తేడా కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా ఆఫర్లో భాగంగా వినియోగదారుడు ఒకవేళ నెలవారీ 200 జీబీ ప్లాన్‌ను ఉపయోగిస్తూ ఆ నెలలో 150 జీబీ మాత్రమే ఉపయోగించుకుంటే మిగిలిపోయిన 50 జీబీ వచ్చే నెలకు క్యారీ అవుతుంది. అప్పుడా నెలలో అతడికి 250 జీబీ లభిస్తుంది. అయితే యూజర్ సేమ్ ప్లాన్‌ను ఎంచుకున్నప్పుడే ఈ ఆఫర్ వర్తిస్తుంది.