Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అయ్యో .. సునీల్ సినిమా అటకెక్కేసిందా?

  • ఓ తమిళ మూవీ రీమేక్ చేయాల్సిన సునీల్ 
  • నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ 
  • స్క్రిప్ట్ విషయంలో మనస్పర్థలంటూ టాక్ 
  • మరో ప్రాజెక్ట్ మొదలెట్టిన నిర్మాత
హీరో సునీల్ తో ఒక సినిమాను నిర్మించడానికి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ రంగంలోకి దిగారు. ఈ సినిమా కోసం ఆయన సునీల్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఓ తమిళ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు అటకెక్కేసిందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించిన విషయంలో సునీల్ కి .. నిర్మాతకి మధ్య మనస్పర్థలు రావడం వల్లనే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు ఆగిపోవడం వల్లనే నిర్మాత కృష్ణ ప్రసాద్ .. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఇక కమెడియన్ గాను నటించాలని సునీల్ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు గనుక, ఆయన పెద్దగా ఫీలయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.         
sunil

More Telugu News