భారత మార్కెట్లోకి 'నోకియా 5.. 3జీబీ ర్యామ్' ఫోన్
- ధర రూ. 13,499
- మొదట ఫ్లిప్కార్ట్లో అమ్మకాలు
- ర్యామ్ మినహా మిగతా ఫీచర్లన్నీ నోకియా 5, 2 జీబీ మోడల్వే
దీని ధరను రూ. 13,499గా కంపెనీ నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఆన్లైన్ వాణిజ్య వెబ్ సైట్ ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు ఈ అమ్మకాలు ఫ్లిప్కార్ట్లో మాత్రమే కొనసాగనున్నాయి. నోకియా - జియో ఆఫర్ కింద ఈ ఫోన్ కొన్నవారికి కొన్ని రీఛార్జీ సదుపాయాలను కూడా ఫ్లిప్కార్ట్ అందుబాటులో ఉంచింది. వారం రోజుల ఆన్లైన్ అమ్మకాల తర్వాత కొన్ని ప్రత్యేక రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి.