నమ్ముతారా... ఈ బిచ్చగాడి సంపాదన నెలకు లక్ష!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నమ్ముతారా... ఈ బిచ్చగాడి సంపాదన నెలకు లక్ష!

  • భారత్ లోని మెట్రోనగరాల్లో యాచకుడి రోజు సంపాదన 500 రూపాయలు
  • చైనాలో బీజింగ్ లోని బిచ్చగాడి రోజు సంపాదన రూ.3,334
  • ఆ బిచ్చగాడి నెల సంపాదన లక్ష రూపాయలు
చాలామంది పనిచేసుకోలేక, సోమరిపోతులుగా మారి యాచక వృత్తిని అలవరచుకుంటారు. అయితే ఈ యాచన ఒకప్పుడు పొట్టపోసుకునేందుకు ప్రధాన వ్యాపకంగా ఉండగా, ఇప్పుడు వృత్తిగా మారింది. ఈ నేపథ్యంలో భారత దేశంలోని మెట్రో నగరాల్లో ఒక యాచకుడు రోజూ 300 రూపాయల నుంచి 500 రూపాయలు సంపాదిస్తుండగా...చైనాలో ఒక బిచ్చగాడు మాత్రం రోజూ 3334 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ లెక్కన ఆ బిచ్చగాడు నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.

అంతేకాదు, అలా సంపాదించే డబ్బుతో తన ముగ్గురు పిల్లలను కార్పొరేట్ స్కూల్ లో చదివిస్తున్నాడు. ఈ ఆదాయంతోనే బీజింగ్ లో నివసించేందుకు రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టించుకున్నాడు. పైగా, తన నెల సంపాదన లెక్కించేందుకు స్థానికుల సహాయం తీసుకుంటాడీ బిచ్చగాడు. చైనాలో అతను డబ్బులు లెక్కిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిచ్చమెత్తడమే మంచి వృత్తిలా కనిపిస్తోందని పలువురు నెటిజన్లు సరదాగా పేర్కొంటుండడం విశేషం. 
China
begger
income

More Telugu News