ఏటీఎంలో రూ. 2000ల దొంగ నోటు.. స‌గమే అచ్చ‌యిన నోటు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏటీఎంలో రూ. 2000ల దొంగ నోటు.. స‌గమే అచ్చ‌యిన నోటు!

  • ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏటీఎంలో ఘ‌ట‌న‌
  • వెంట‌నే బ్యాంకుకు తెలియ‌జేసిన షాదాబ్‌
  • 420 కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు
దొంగ‌నోట్ల‌ను అరిక‌ట్టాల్సిన బ్యాంకులే... ఏటీఎంలో దొంగ‌నోట్లను పెట్ట‌డం శోచ‌నీయం. అవును... దేశ‌రాజ‌ధాని న్యూఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏటీఎంలో రూ. 2000ల దొంగ నోటు, అది కూడా స‌గ‌మే ప్రింట్ అయిన నోటు వ‌చ్చింది. ఈ నోటు గురించి ఖాతాదారు షాదాబ్ బ్యాంకులో స‌మాచార‌మిచ్చాడు. బ్యాంకు వారు పోలీసుల‌కు తెలియ‌జేయగా వారు 420 కేసు న‌మోదు చేశారు.

ఏటీఎం నుంచి షాదాబ్ రూ. 10 వేలు విత్‌డ్రా చేయ‌గా, నాలుగు రూ. 2000ల నోట్లు, మూడు రూ. 500 నోట్లు, ఐదు రూ. 100 నోట్లు వ‌చ్చాయ‌ని, వాటిలో ఒక రూ. 2000 నోటు స‌గ‌మే అచ్చ‌యి ఉంద‌ని, మిగ‌తా భాగంలో తెల్ల కాగితం ఉంద‌ని షాదాబ్ పేర్కొన్నాడు. గ‌తంలో కూడా ఢిల్లీలోని ఏటీఎంల‌లో న‌కిలీ రూ. 2000ల నోట్లు వ‌చ్చిన ఘ‌ట‌న‌లు జరిగిన‌ప్ప‌టికీ ఆర్థిక శాఖ ఇంకా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.
atm
fake note
delhi
bank
half printed
shaheen baag

More Telugu News