రాస్ టేలర్ కు 'ఆధార్' కార్డు ఇవ్వాలన్న సెహ్వాగ్.. స్పందించిన ఆధార్ విభాగం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాస్ టేలర్ కు 'ఆధార్' కార్డు ఇవ్వాలన్న సెహ్వాగ్.. స్పందించిన ఆధార్ విభాగం!

  • తొలి వన్డే ముగిసిన అనంతరం ట్విట్టర్ లో సెహ్వాగ్, రాస్ టేలర్ మధ్య ఆసక్తికర హిందీ సంభాషణ
  • టేలర్ సమాధానానికి నెటిజన్లు ఫిదా...సెహ్వాగ్ ప్రశంసలు
  • టేలర్ కు ఆధార్ కార్డు ఇవ్వాలన్న సెహ్వాగ్
న్యూజిలాండ్‌ స్టార్ క్రికెటర్ రాస్‌ టేలర్‌ కు ఆధార్‌ కార్డు ఇవ్వాలంటూ టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన ట్వీట్ కు ఆధార్ జారీ సంస్థ స్పందించింది. దాని వివరాల్లోకి వెళ్తే..కివీస్ తో తొలి వన్డే అనంతరం ట్విట్టర్ లో వీరూ స్పందిస్తూ, ‘‘దర్జీ (టేలర్‌) గారు బాగా ఆడారు. దీపావళి గిరాకీలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. మంచి ప్రదర్శన చేశారు’’ అని ట్వీట్‌ చేశాడు. బదులుగా టేలర్‌.. ‘‘ఈసారి మీ ఆర్డర్‌ ను ముందే పంపండి. దీపావళి కంటే ముందే మీ బట్టలు కుట్టి ఇచ్చేస్తాను’’ అంటూ బదులిచ్చాడు.

 రెండో టీ20లో టేలర్ విఫలం కావడంతో మరో ట్వీట్ చేసిన వీరూ ‘‘టైలర్‌ దుకాణం బంద్‌ అయ్యింది.. తిరువనంతపురంలో కలుద్దాం’’ అని పేర్కొంటూ మూతపడ్డ ఓ టైలర్‌ దుకాణం ముందు కూర్చున్న ఫొటోను కూడా పోస్టు చేశాడు. అంతే కాకుండా టేలర్‌ హిందీ చాలా బాగా నేర్చేసుకున్నాడని తెలిపాడు. టేలర్‌ హిందీ ప్రావీణ్యానికి ముగ్ధుడినయ్యానని తెలిపిన వీరూ, అతడికి ఆధార్‌ కార్డు ఇవ్వాలని‌ అభిప్రాయపడ్డాడు.

దీనిపై ఆధార్‌ కార్డు జారీ చేసే ప్రభుత్వ సంస్థ 'యుఐడిఏఐ' స్పందిస్తూ, ‘‘ఇక్కడ భాష ముఖ్యం కాదు. ఎక్కడ నివసిస్తారన్నది ముఖ్యం’’ అంటూ సమాధానం ఇచ్చింది.
Cricket
team india
newziland
sehwagh
ross talor

More Telugu News