జగన్ పాదయాత్రలో అపశ్రుతి.. గుండెపోటుతో మరణించిన కార్యకర్త!
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర'లో అపశ్రుతి చోటు చేసుకుంది. సీకే దిన్నెకు చెందిన వెంకటరమణ అనే కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జగన్... వెంకటరమణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జగన్ పాదయాత్ర ఈ ఉదయం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తన తండ్రి వైయస్ సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం, బహిరంగసభలో ప్రసంగించి, పాదయాత్రను ప్రారంభించారు జగన్. ఆరు నెలలపాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది.