BCCI: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్.. ప్రాక్టీస్, ప్రయాణాలపై ఆంక్షలు

BCCI Announces New Rules for IPL Teams Practice and Travel
షార్ట్స్‌లో చూడండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కీలక మార్పులు చేసింది. టోర్నీలో పాల్గొనే జట్ల కోసం శిక్షణ, మ్యాచ్ రోజుల ప్రవర్తనపై సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు అన్ని జట్ల మేనేజర్లకు సమాచారం అందించింది. పిచ్‌లను కాపాడటంతో పాటు షెడ్యూలింగ్‌ను క్రమబద్ధీకరించే లక్ష్యంతో మ్యాచ్ జరిగే రోజున జట్లు ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధించింది.

ముంబైలోని వాంఖడే స్టేడియం వంటి వేదికల కోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా బోర్డు వివరించింది. ఇక్కడ ప్రాక్టీస్ కోసం ప్రతి జట్టుకు రెండు నెట్స్‌తో పాటు, రేంజ్ హిట్టింగ్ కోసం మెయిన్ స్క్వేర్‌పై ఒక సైడ్ వికెట్‌ను కేటాయించనున్నారు. ఒకవేళ రెండు జట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేస్తే, చెరో రెండు వికెట్లు ఇస్తారు. అయితే, ప్రత్యర్థి జట్టుకు కేటాయించిన ప్రాక్టీస్ ఏరియా ఖాళీగా ఉన్నప్పటికీ, దాన్ని వినియోగించడంపై కచ్చితమైన నిషేధం విధించారు.

అంతేకాకుండా ఓపెన్ నెట్స్ నిర్వహించడం లేదా ఒక జట్టు త్వరగా వెళ్లిపోతే వారి వికెట్లను వినియోగించుకోవడం వంటి వాటిని కూడా అనుమతించబోమని బోర్డు తెలిపింది. మ్యాచ్ రోజున మెయిన్ స్క్వేర్‌పై ఎలాంటి ఫిట్‌నెస్ డ్రిల్స్ చేయకూడదన్న పాత నిబంధనను ఈసారి కూడా కొనసాగించనున్నారు.

గతంలో అంతర్జాతీయ పర్యటనలకు వర్తింపజేసిన నిబంధనల తరహాలోనే, ఈసారి ఐపీఎల్‌లో కూడా ఆటగాళ్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా టీమ్ బస్సులోనే స్టేడియానికి ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఐపీఎల్‌కు వర్తించే కుటుంబ మార్గదర్శకాలు
గతేడాది ఇదే సమయానికి, 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్న అంతర్జాతీయ పర్యటనల సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలవడాన్ని పరిమితం చేస్తూ బీసీసీఐ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఈ ఐపీఎల్ సీజన్ నుంచి కూడా అలాంటి నిబంధనే అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. 
Go Back to Shorts
BCCI
IPL 2026
Indian Premier League
IPL Rules
Cricket
Cricket Rules
Team Practice
Match Day Restrictions
Wankhede Stadium
Cricket Travel

More Telugu News