మాజీ ప్రేమికులకు ఓ మార్కెట్.. పాత జ్ఞాపకాలను అమ్ముకునే సదుపాయం!
- మార్కెట్ పేరు ఓల్డ్ ఫ్లేమ్స్
- గ్రీటింగ్ కార్డులు, దుస్తులు, బహుమతులను అమ్ముకోవచ్చు
- కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం
అమ్ముకోవడం ద్వారానే ఈ మార్కెట్ పాప్యులర్ కాలేదు... భగ్నప్రేమికులు అమ్ముకున్న వస్తువులను కొనడానికి కూడా చాలా మంది ముందుకు రావడం వల్ల కూడా ఈ మార్కెట్ ప్రాచుర్యం పొందుతోంది. వస్తువులను కొనేందుకు వచ్చిన వారు అక్కడి విఫల ప్రేమికుల గాథలను విని వారిని ఓదారుస్తుంటారట. వారు అమ్ముతున్న వస్తువు వెనక కథలతో పాటు, వారి ప్రేమ విషయాలను కూడా భగ్న ప్రేమికులు కొనడానికి వచ్చిన వారితో పంచుకుంటున్నారట. ఈ మార్కెట్‌కి వచ్చిన ప్రాచుర్యం కారణంగా త్వరలోనే వియత్నాంలోని హోచిమిన్ సిటీలో ఓ శాఖను కూడా తెరిచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.