కాన్వెంట్ చదువుతో ఉపరాష్ట్రపతి కాలేదు.. కష్టపడి ఈ స్థాయికి వచ్చా: వెంకయ్య
- నన్నయ వర్సిటీలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్కు శంకుస్థాపన
- విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖి
- కాన్వెంట్ చదువులు చదివితేనే గొప్పవారిమి అవుతామని అనుకోవద్దు
- మార్కుల కోసం కాకుండా, వ్యక్తిత్వంలో మార్పు కోసం చదవాలి
మనిషి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని వెంకయ్య నాయుడు చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలని, మార్కుల కోసం కాకుండా, వ్యక్తిత్వంలో మార్పు కోసం చదవాలని సూచించారు. విద్యార్థులు అన్ని భాషలూ నేర్చుకోవాలని, మాతృభాషను మాత్రం మరిచిపోవద్దని చెప్పారు.