Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు సినిమాలు బాగా చూస్తారు: జగన్

  • బాహుబలి సెట్టింగ్ చూసి, అదే మన రాజధాని అని చెప్పారు
  • రైతుల భూములు లాక్కున్న చంద్రబాబు... బినామీలకు మాత్రం మేలు చేశారు
  • వైయస్ ప్రాజెక్టులు కడితే... చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారు
బ్రహ్మాండమైన రాజధాని కడతామని చంద్రబాబు చెప్పారని... ఇంతవరకు ఒక్క శాశ్వత భవనానికి కూడా ఒక్క ఇటుక కూడా వేయలేదని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏ సినిమా రిలీజ్ అయినా దాన్ని చూస్తారని... సినిమాను చూసి, బాహుబలిలో సెట్టింగ్ బాగుంది, మన రాజధాని అదిగో అంటూ చెప్పేస్తారని అన్నారు. సింగపూర్ కు పోతే సింగపూరే రాజధాని అంటారని, జపాన్ కు పోతే జపానే రాజధాని అంటారని అన్నారు. ఇంకానయం, చంద్రబాబు ఇంగ్లీష్ సినిమాలు చూడ్డం లేదని ఎద్దేవా చేశారు.

రాజధాని పేరుతో చంద్రబాబు తన అనుచరులకు మేలు చేశారని జగన్ విమర్శించారు. ఆయన బినామీల భూములను మాత్రం వదిలేసి, రైతుల భూములను మాత్రం చంద్రబాబు లాక్కున్నారని అన్నారు. వైయస్ పూర్తి చేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని చెప్పారు. నాన్నగారు 85 శాతం ప్రాజెక్టులను పూర్తి చేస్తే, 15 శాతం పూర్తి చేయడానికి చంద్రబాబు లంచాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టులు కట్టిన వ్యక్తి గొప్పా? గేట్లు ఎత్తిన వ్యక్తి గొప్పా? అని ప్రశ్నించారు. 
ys jagan
jagan padayatra
Chandrababu

More Telugu News