బాలీవుడ్ మరో బయోపిక్... అరుణిమ సిన్హాగా నటించనున్న కంగనా?
- ఒంటికాలితో ఎవరెస్ట్ అధిరోహించిన అరుణిమ
- రైలు ప్రమాదంలో కాలు కోల్పోయిన అరుణిమ
- ప్రస్తుతం 'మణికర్ణిక' చిత్రంలో నటిస్తున్న కంగనా
ప్రస్తుతం 'మణికర్ణిక' చిత్రంలో నటిస్తోన్న కంగనా రనౌత్, షూటింగ్ పూర్తికాగానే అరుణిమ చిత్రానికి సంతకం చేయనున్నట్లు పింక్విల్లా తెలిపింది. 60 రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు ఎవరనే విషయం ఈ నెలాఖరులోగా వెల్లడించనున్నారు. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అరుణిమ సిన్హాను 2011లో నడుస్తున్న రైలు నుంచి తోసేశారు. దీంతో ఆమె ఒక కాలు కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ స్థైర్యం తెచ్చుకుని ఒంటికాలుతోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆదర్శంగా నిలిచింది.