న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ఆడుతోన్న‌ హైదరాబాద్ క్రికెట‌ర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ఆడుతోన్న‌ హైదరాబాద్ క్రికెట‌ర్‌

  • భార‌త జ‌ట్టులోకి హైద‌రాబాద్ కుర్రాడు మొహ్మద్ సిరాజ్ అరంగేట్రం
  • ప్ర‌స్తుతం న్యూజిలాండ్ స్కోరు 7 ఓవ‌ర్ల‌కి వికెట్ న‌ష్ట‌పోకుండా 52
గుజరాత్‌లోని రాజ్ కోట్ వేదికగా జ‌రుగుతోన్న‌ టీమిండియా-కివీస్ రెండో టీ20 మ్యాచ్‌లో హైద‌రాబాద్ కుర్రాడు మొహ్మద్ సిరాజ్ కూడా ఆడుతున్నాడు. న్యూజిలాండ్ తో మూడు టీ 20ల సిరీస్‌కి సెలెక్ట‌ర్లు పేస‌ర్ మొహ్మ‌ద్ సిరాజ్‌ను ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.

మొదటి టీ20లో చోటు ద‌క్కించుకోలేక‌పోయిన సిరాజ్ రెండో టీ20లో మాత్రం ఆడుతున్నాడు. మైదానంలో సిరాజ్ ప‌లుసార్లు భావోద్వేగానికి గురయ్యాడు. కాగా, నేటి టీ20లో న్యూజిలాండ్ ఓపెన‌ర్లు రాణిస్తున్నారు. గుప్టిల్ 32, మున్రో 17 ప‌రుగులతో క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ స్కోరు 7 ఓవ‌ర్ల‌కి వికెట్ న‌ష్ట‌పోకుండా 52 గా ఉంది.   
siraj
India
newzealand

More Telugu News