భారత్‌లో మరిన్ని వాల్‌మార్ట్ స్టోర్లు!
- అమెరికాకు చెందిన రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్
- ‘బెస్ట్‌ప్రైస్’ పేరుతో భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 21స్టోర్లు
- మరో 30 స్టోర్లను నిర్మించడానికి కసరత్తులు
- మహారాష్ట్రలో 15స్టోర్లు నిర్మించేందుకు రూ.900 కోట్ల పెట్టుబడి
ఇప్పటికే 19 నుంచి 20 స్టోర్లకు సంబంధించిన నిర్మాణాలపై ఒప్పందాలు జరిగిపోయాయి. 10 నెలల్లో ఆ నిర్మాణాలు పూర్తవుతాయని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. వచ్చే ఏడాది కొత్తగా ఐదు నుంచి ఏడు స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తున్నారు. మహారాష్ట్రలో 15 స్టోర్లు నిర్మించేందుకు రూ.900 కోట్లు పెట్టుబడిపెట్టినట్లు తెలిపింది.