ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ అమ్మకాల వెల్లువ.. మూడో త్రైమాసికంలో 40 కోట్ల విక్రయాలు!
- అమ్మకాల్లో సత్తా చాటిన టాప్-10 బ్రాండ్లు
- మార్కెట్లో అత్యధిక శాతం వాటా సొంతం
- భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో చైనా ఫోన్లకు గిరాకీ
చైనా బ్రాండ్స్ అయిన షియోమీ, వివో, ఒప్పో, హువేయిలు అత్యంత వేగంగా ఎదుగుతున్న స్మార్ట్ఫోన్ బ్రాండ్లుగా నిలిచాయి. అలాగే శాంసంగ్, ఆపిల్, ఎల్జీలు కూడా ఈ త్రైమాసికంలో సత్తా చాటాయి. ఇండియా, దక్షిణాసియా దేశాల్లో చైనా బ్రాండ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఆయా దేశాల మార్కెట్లలో చైనా బ్రాండ్లు టాప్-5లో ఉన్నట్టు నివేదిక పేర్కొంది.