Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చానాళ్లకు హిట్ కొట్టిన రాజశేఖర్... కూతుళ్లతో కలసి తీన్ మార్ డ్యాన్స్... వీడియో చూడండి!

  • హిట్ టాక్ తెచ్చుకున్న 'పీఎస్యూ గరుడవేగ'
  • కుమార్తెలతో ఆనందాన్ని పంచుకున్న రాజశేఖర్
  • తీన్ మార్ డ్యాన్స్ వేసిన జీవిత, దర్శకుడు ప్రవీణ్ సత్తారు
చాలా రోజుల తరువాత ఓ హిట్ సినిమా వచ్చిందన్న ఆనందం ఇప్పుడు హీరో రాజశేఖర్ కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న విడుదలైన 'పీఎస్వీ గరుడవేగ' చిత్రం మంచి టాక్ ను తెచ్చుకోవడంతో ఆయన ఇంట్లో పండగ వాతావరణం వచ్చేసింది. రాజశేఖర్ తో పాటు ఆయన భార్య జీవిత, కుమార్తెలు ఆనందంగా డ్యాన్స్ చేశారు.

రాజశేఖర్ ఇంటి బయట డప్పుల వాయిద్యాలు మిన్నంటుతుండగా, బాల్కనీలో నిలిచిన రాజశేఖర్ తీన్ మార్ స్టెప్పులు వేశారు. ఆయనతో పాటు చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా పాదం కదిపాడు. కొంతమంది అభిమానులు రాజశేఖర్ ను పూల మాలలతో సత్కరించారు. రాజశేఖర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను మీరూ చూడవచ్చు.
rajashekar
garudavega
dance
hit

More Telugu News