కొద్దిసేపు వాట్సాప్ ప‌నిచేయ‌క‌పోతే కొంప మునిగినంత పని చేశారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొద్దిసేపు వాట్సాప్ ప‌నిచేయ‌క‌పోతే కొంప మునిగినంత పని చేశారు!

  • సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వాట్సాప్ మొరాయింపు
  • న‌వ్వు పుట్టించే కామెంట్లు చేసిన్న నెటిజ‌న్లు
  • దాదాపు గంట‌న్న‌ర సేపు ప‌నిచేయ‌ని వాట్సాప్‌
భార‌త్‌ స‌హా ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, అమెరికా దేశాల్లో కూడా మెసేజింగ్ స‌ర్వీస్ యాప్ వాట్సాప్ దాదాపు గంట‌న్న‌ర సేపు ప‌నిచేయ‌డం మొరాయించింది. ఈ కార‌ణంగా ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారులు అయోమ‌యానికి గురయ్యారు. ఏం జ‌రిగిందో అర్థం కాక సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో వాట్సాప్ మొరాయింపు అనేది సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశం గురించి త‌మ‌కు న‌చ్చిన రీతిలో నెటిజ‌న్లు న‌వ్వుపుట్టించే కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు.

'ప్ర‌పంచం అంత‌మ‌య్యే రోజు వ‌చ్చేసింది',
'నిన్న ట్రంప్ ట్విట్ట‌ర్‌ను బ్లాక్ చేసిన వ్యక్తి ఇవాళ వాట్సాప్‌లో చేరి ఉంటాడు',
 'హ‌మ్మ‌య్య ఇన్నాళ్ల‌కు నా కుటుంబంతో గ‌డిపే స‌మ‌యం దొరికింది',
 'ఈ కొద్దిస‌మ‌యంలో ఎంత‌మంది ల‌వ‌ర్స్ బ్రేక‌ప్ అయి ఉంటారో...!' అంటూ కామెంట్లు చేశారు.
whatsapp
december
upi payments
sender
receiver
beta version
rupee
down
satires

More Telugu News